అమెరికాలో ఓ భారతీయుడికి 52 నెలల జైలు.. 380 ఆ వీడియోలు..

సోమవారం, 6 ఆగస్టు 2018 (10:56 IST)
దేశంలో బాలికలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్న నేపథ్యంలో.. అమెరికాలో ఓ భారతీయుడు బాలికల నీలి చిత్రాలు కలిగివున్నాడనే కారణంతో జైలు శిక్ష ఖరారైంది. వివరాల్లోకి వెళితే.. బాలికల నీలి చిత్రాలు కలిగి ఉన్నాడన్న కేసులో దోషిగా తేలడంతో అమెరికా కోర్టు భారతీయుడికి నాలుగేళ్ల, నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. అంతేకాదు, విడుదలయ్యాక కూడా అతడిపై పదేళ్లపాటు పర్యవేక్షణ కొనసాగించాలని పోలీసులను ఆదేశించింది.
 
పిట్స్‌బర్గ్‌కు చెందిన అభిజిత్ దాస్(28) వద్ద చైల్డ్ పోర్నోగ్రఫీకి చెందిన 1000 ఫొటోలు, 380 వీడియోలను గుర్తించినట్టు అటార్నీ స్కాట్ బ్రాడీ కోర్టుకు వివరించారు. నేరం నిరూపణ కావడంతో అభిజిత్‌కు 52 నెలల జైలు శిక్ష విధించింది. జైలునుంచి విడుదలయ్యాక కూడా మరో 10 ఏళ్లపాటు అతడిపై కన్నేసి వుంచాలని కోర్టు స్పష్టం చేసింది.
 
అమెరికా చట్టం ప్రకారం, పిల్లల అశ్లీలత నేరం. అదీ 18సంవత్సరాల కంటే తక్కువ గల బాలలపై ఇలాంటి వీడియోలు తీయడం నేరం కిందే వస్తుంది. బాలల అశ్లీల దృశ్యాలు, వీడియోలు చట్ట విరుద్ధమని కోర్టు మరోసారి గుర్తు చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు