ఫిలిప్పీన్స్‌ను కుదిపేసిన భూకంపాలు.. 16మంది మృతి

బుధవారం, 24 ఏప్రియల్ 2019 (11:16 IST)
ఫిలిప్పీన్స్‌ను భూకంపాలు కుదిపేశాయి. ఫిలిప్పీన్స్‌లో సంభవించిన రెండు భారీ భూకంపాల్లో 16మంది ప్రాణాలు కోల్పోయారు. తొలుత ఆగ్నేయాసియా ద్వీప సమూహమైన లూజన్ ఐలండ్‌లో సోమవారం 6.1 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి. 
 
అలాగే మంగళవారం 6.3 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లోని సామర్ ద్వీపంలో 53.6 మైళ్ల లోతున భూకంపం సంభవించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) తెలిపింది. 
 
అయితే, సునామీ ప్రమాదం లేదని పేర్కొంది. ఈ ఘటనలో 29 భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల తొలగించడంలో సహాయక సిబ్బంది నిమగ్నమయ్యారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు