ఆకాశంలో వంటనూనెలు: బిక్కచచ్చిపోతున్న పాకిస్తాన్ ప్రజలు

బుధవారం, 1 జూన్ 2022 (23:03 IST)
పొరుగు దేశం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ నానాటికి పతనం దిశగా వెళుతోంది. అక్కడ తాజాగా వంట నూనె ధరలు ప్రజలకు షాకిస్తున్నాయి. వంట నూనె, నెయ్యి ధరలను లీటరు ఒక్కింటికి ఏకంగా రూ. 213, రూ. 208 పెంచడంతో వాటి ధరలు ఏకంగా రూ. 605, రూ. 555కి చేరాయి. పెరిగిన వంట నూనె ధరలు నిన్నటి నుంచి అమలు లోకి వచ్చాయి. దీనితో జనం లబోదిబోమంటున్నారు.

 
ఇప్పటికే పెట్రోల్, ఏటీఎం సెంటర్లలో కరెన్సీ నిండుకున్నట్లు సమాచారం. మరోవైపు పాకిస్తాన్ వంటనూనెల కోసం ఇండోనేసియా, మలేసియాల పైనే ఆధారపడుతోంది. వంటనూనె తయారీదారులకు ఇవ్వాల్సిన బకాయిలు సుమారు 2 బిలియన్ రూపాయల మేర పేరుకుపోవడంతో వారు నూనెలను పంపేందుకు ససేమిరా అంటున్నారట. మొత్తమ్మీద పాకిస్తాన్ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు