భారత్‌‍కు వార్నింగ్ ఇచ్చిన రష్యా.. ఎందుకో తెలుసా?

శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (17:58 IST)
భారత్‌కు రష్యా గట్టి వార్నింగ్ ఇచ్చింది. అంతర్జాతీయ సమాజంలో తమకు వ్యతిరేకంగా చేపట్టే చర్యలు, తీర్మానాలపై జరిగే ఓటింగ్‌లో పాల్గొనకుండా తటస్థంగా ఉండటం అంటే తమతో శత్రుత్వాన్ని పెంచుకోవడమేనంటూ రష్యా గట్టిగా హెచ్చరించింది. 
 
ఇటీవల ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి స్పందిస్తూ, ఉక్రెయిన్ వివాదం ప్రారంభమైనప్పటి నుంచి భారత్ శాంతి, చర్చలు, దౌత్య కోసం నిలబడిందన్నారు. రక్తం చిందించడం, అమాయకుల ప్రాణాలు తీసుకోవడం కారణంగా ఎలాంటి పరిష్కారం ఉండదని భారత్ గట్టిగా నమ్ముతుంది. భారత్ ఎల్లవేళలా శాంతి పక్షంగా ఉంటుంది. హింసను కోరుకోదని అన్నారు.
 
దీనిపై రష్యా స్పందించింది. రష్యాకు వ్యతిరేకంగా జరిగే ఓటింగ్‌లో పాల్గొనకపోవడం అంటే తమతో శత్రుత్వాన్ని పెంచుకోవడమే అవుతుందన్నారు. ఇది భవిష్యత్తులో దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు