దేశంలోని అందరు ప్రభుత్వ ఉద్యోగులకు క్షమాభిక్ష పెట్టేశామని, అందరూ వచ్చి ఎప్పటిలాగే ధైర్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. పూర్తి భరోసాతో మీ సాధారణ జీవితాన్ని గడపండి అంటూ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తాలిబన్లు స్పష్టం చేశారు.
ఆదివారమే రాజధాని కాబూల్ సహా దేశం మొత్తాన్నీ తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్న విషయం తెల్సిందే. వాళ్ల రాక్షస రాజ్యాన్ని తలుచుకుంటూ ఇప్పటికే ఎన్నో వేల మంది పౌరులు దేశాన్ని వదిలి వెళ్లడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్లు గత ప్రభుత్వంలో పని చేసిన ఉద్యోగులకు క్షమాభిక్ష పెట్టినట్లు ప్రకటించడం గమనార్హం.