ఇటీవలే ఆ వ్యక్తికి ఆ మహిళకు వివాహమైందన్న విషయం తెలిసింది. అప్పటి నుండి తరచూ వీరిమధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. హఠాత్తుగా ఒక రోజు ఆ మహిళ అతనిని చంపేసి, శవాన్ని ఏమి చెయ్యాలో తెలీక ముక్కలు ముక్కలుగా కోసింది. అయితే అప్పటికే ఇరుగుపొరుగు వారికి దుర్వాసన వచ్చి అడుగగా ఎండుచేపలు కొన్నానని, అవి పాడైపోయాయని చెప్పింది. ఆ తర్వాత ఆ మాంసాన్ని కుక్కర్‌లో వేసి ఉడికించింది. రెండురోజులు దాటినా కూడా దుర్వాసన తగ్గకపోవడంతో పక్కింటి మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.