వర్క్ ఫ్రమ్ హోమ్.. ల్యాప్‌టాప్‌లకు గిరాకీ.. హానర్ మ్యాజిక్‌ బుక్‌ 15 వచ్చేసిందిగా...!

సోమవారం, 3 ఆగస్టు 2020 (19:05 IST)
MagicBook 15
కరోనా వైరస్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ పెరిగిపోతోంది. ల్యాప్‌టాప్‌లకు గిరాకీ పెరిగిన నేపథ్యంలో హానర్‌ సంస్థ ల్యాప్ టాప్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది. హానర్‌ మ్యాజిక్‌ బుక్‌ 15 పేరుతో తొలి ల్యాప్ టాప్‌ను భారత దేశంలో విడుదల చేసింది. విండోస్‌ ముందే ఇన్‌స్టాల్ చేసిన ఈ ల్యాపటాప్‌ ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, ఏఎంబీ రైజెన్‌ 3000 సిరీస్ సీపీయూలు, గ్రాఫిక్‌ లాంటి ఫీచర్లు ఉన్నాయి. 
 
ప్రారంభ ఆఫర్‌గా 3000 తగ్గింపుతో రూ. 39,990 రూపాయలకే అందిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ ల్యాప్ టాప్ ప్రారంభం అయింది. కానీ ఇప్పుడే ఈ ల్యాప్ టాప్ అందుబాటులోకి వచ్చింది. 
 
సింగిల్ కలర్ వేరియంట్‌లో ఇవి లభ్యం అవుతున్నాయి. ఆగస్టు మొదటి వారం నుంచి వీటి అమ్మకాలు అందుబాటులో ఉంటాయి. ప్రారంభం ఆఫర్లో భాగంగా రాయితీ ధరలను హానర్‌ ప్రకటించింది. హానర్ మ్యాజిక్ ల్యాప్ టాప్ హానర్ మ్యాజిక్‌ బుక్‌ 15 ధర 42,990 రూపాయలు. మిస్టిక్ సిల్వర్ కలర్‌లో ఆగస్టు 6న ఉదయం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. 
 
స్పెసిఫికేషన్లు: 
* హానర్ మ్యాజిక్‌ బుక్‌15 డిజైన్ బాగుంది 
* విండోస్ 10 హోమ్ 
* 15.6-అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే 
* టైప్-సీ పోర్ట్‌, 65 వాట్స్ చార్జర్‌ ద్వారా కేవలం 30 నిమిషాల్లో 50 శాతం రీచార్జ్ 
* వీడియోలు చూసినా బ్యాటరీ సమయం 6.3 గంటలు 
 
* టూ-ఇన్-వన్ ఫింగర్‌ ప్రింట్‌ పవర్‌ బటన్‌ పాప్-అప్ వెబ్‌ క్యామ్‌ 
* వై-ఫై, బ్లూటూత్, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి 2.0, యుఎస్‌బి 3.0
* హెచ్‌డిఎంఐ పోర్ట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్
* 1920x1080 పిక్సెల్స్ 87 శాతం స్క్రీన్ 
*యూటీవీ రీన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ 
* 8 జీబీ ర్యామ్‌ 256జీబీస్టోరేజ్‌.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు