లావా రూ. 11,999కు 8జిబి RAM, డైమెన్సిటి 6080తో పవర్ ప్యాక్ట్ ‘స్టార్మ్ 5జి’ విడుదల

గురువారం, 21 డిశెంబరు 2023 (23:11 IST)
భారతదేశపు ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్, లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఈరోజు పవర్ హౌస్ ‘స్టార్మ్ 5జి’ ను రూ. 11,999 ప్రత్యేక ప్రారంభ ధరకు, ఎంపిక చేయబడిన బ్యాంక్ ఆఫర్స్‌తో ప్రకటించింది. ఈ పరికరము డిసెంబరు 28 నుండి ఈ-కామర్స్ పోర్టల్ అమెజాన్, లావా ఈ-స్టోర్ పైన అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.
 
స్టార్మ్ 5జి మీడియాటెక్ డిమెన్సిటి 6080 ఆధారితమైనది, 4,20,000 మించి AnTuTu స్కోర్‌ను పెంచుతూ శక్తివంతమైన ప్రాసెసర్‌తో అపరిమితమైన గేమింగ్ పనితీరును అందిస్తుంది. దీనిలో ఈ విభాగములోనే ఉత్తమమైన 8జిబి RAM ఉంది. ల్యాగ్-ఫ్రీ యూజర్ అనుభవముల్ కొరకు దీనిని 16జిబి వరకు విస్తరించవచ్చు, తద్వారా ఆసక్తి కలిగిన గేమర్స్ కొరకు మంచి నేస్తం అవుతుంది. విస్తరించదగిన 128 జిబి ROM గేమ్స్, యాప్స్ మరియు మల్టీమీడియా కంటెంట్ కొరకు తగినంత స్టోరేజ్ అందిస్తుంది.
 
ఈ పరికరములో 120Hz రెఫ్రెష్ రేట్, వైడ్‎వైన్ ఎల్1 సహకారముతో 17.22 సెమీ (6.78”) ఎఫ్‎హెచ్‎డి+ ఐపిఎస్ డిస్ప్లే ఉంది. ఇది గేమింగ్ సమయములో లేదా వీడియోలు చూసేటప్పుడు యానిమేషన్స్ లో అస్పష్టతను తొలగించి సుస్పష్టమైన, ల్యాగ్ ఫ్రీ వీక్షణను అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ రెండు అద్భుతమైన రంగు వేరియంట్స్ లో-గేల్ గ్రీన్, థండర్ బ్లాక్‌లలో అందుబాటులో ఉంటుంది. పక్కన బిగించబడిన్ అన్ అల్ట్రా-ఫాస్ట్ ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్‎లాక్‌లతో ఆధునిక భద్రతా ఫీచర్స్ కలిగి ఉంటుంది.
 
స్టార్మ్ 5జి ఉత్తమమైన ఫోటోగ్రఫీ అనుభవము, సెల్ఫీల కొరకు 50ఎంపి, 8ఎంపి అల్ట్రా వైడ్ డ్యుయల్ రియర్ కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరాలతో ప్రీమియం గ్లాస్ బ్యాక్ డిజైన్ కలిగి ఉంది. ఇందులో అంతరాయం లేని రోజువారి వినియోగము కొరకు పెద్ద 5000mAh బ్యాటరీ, ఈ విభాగములోనే మొట్టమొదటి 33W వేగవంతమైన చార్జింగ్‌లు ఉన్నాయి.
 
అదనంగా, స్టార్మ్ 5జి ఆధునిక క్లీన్, బ్లోట్‎వేర్ ఆండ్రాయిడ్ 13 పై నడుస్తుంది. స్వచ్ఛమైన మరియు సహజమైన ఆండ్రాయిడ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ పరికరములో రెండు సంవత్సరాల భద్రతా అప్డేట్స్ తోపాటు హామీ ఇవ్వబడిన ఆండ్రాయిడ్ 14 అప్‎గ్రేడ్ అందించబడింది. వినియోగదారు కేంద్రక బ్రాండ్ అయిన లావా తన స్మార్ట్ ఫోన్స్ పై ఎలాంటి బ్లోట్ వేర్ ఇన్స్టాల్ చేయకుండా ఒక వైఖరిని చేపట్టింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు