కుర్రోడి వయసు 18... 14 మంది అమ్మాయిలను ప్రేమించాడు...
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (19:04 IST)
14 మంది యువతులతో ప్రేమాయణం నడిపిన ఓ యువకుడు అందరూ కలిసి షాక్ ఇవ్వడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. వాలంటైన్స్ డే వరకూ అంతా బాగానే ఉన్నా, ఆ రోజు అతని ఫోన్ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. రఖీబ్ అనే 18 ఏళ్ల యువకుడి విషయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
యువకుని ప్రేమికురాళ్లలో ఒకరైన జొరినాకి అతనిపై మొదటి నుండి అనుమానం ఉంది. అతని గురించి కనిపెట్టాలనుకుంది. ఇందులోభాగంగా అతని మొబైల్‌ని రహస్యంగా తనిఖీ చేసింది. అందులో బార్బిగల్ 1..2..3.. అంటూ 14 మంది అమ్మాయిలు నమోదు చేసి ఉన్నట్లు గుర్తించింది.
తమను మోసం చేస్తున్నాడని గ్రహించిన ఆమె మిగతా వారికి ఫోన్ చేసి అసలు విషయం చెప్పింది. అందరూ కలిసి అతనికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ప్రియురాళ్లు వాలంటైన్స్ డే రోజు సమూహంగా అతని ఇంటికి వెళ్లారు.
అప్పుడే నిద్ర లేచిన రఖీబ్ తన గదిలో ప్రియురాళ్లు ఉండటం చూసి ఖంగుతిన్నాడు. నిజం బయటపడిందని భయపడిపోయాడు. మానసిక ఒత్తిడితో కోమాలోకి వెళ్లిపోయాడు. అతనికి బుద్ధిచెప్పాలని వెళ్లిన యువతులకు చివరికి ఇలా ఎదురుదెబ్బ తగిలింది. వారందరూ ఇప్పుడు అతను కోలుకోవాలని ఆశపడుతున్నారు.