ఆసమయంలో స్టేషన్ ఫ్లాట్‌ఫాంపై ఉన్న ఢిల్లీ, శాస్త్రి పార్క్ ప్రాంత నివాసి, టాక్సీ డ్రైవర్ చున్ను కుమార్ ఆమెతో మాటలు కలిపాడు. లూథియానా వెళ్లాల్సిన రైలును రద్దుచేసినట్లు ఆమెను నమ్మించాడు. ఆ తర్వాత తన టాక్సీలో ఢిల్లీ బస్టాండులో దింపుతానని, అక్కడ నుంచి బస్సులో వెళ్లొచ్చని చెప్పడంతో ఆ యువతి అతని మాటలు నమ్మి కారులో ఎక్కి కూర్చొంది.
కారును స్టార్ట్ చేసిన కుమార్ నేరుగా ఎర్రకోట సమీపంలో ఉన్న గోల్డెన్ జూబ్లీ పార్కుకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను అదే కారులో తీసుకుని వచ్చి పాత ఢిల్లీ రైల్వేస్టేషన్ వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత బాధితురాలు నోయిడాలోని తన సోదరుడి ఇంటికి వెళ్లి జరిగిందంతా వివరించింది. సోదరుడి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు జరిపిన పోలీసులు కుమార్‌ను అరెస్టు చేశారు.