ఈ ఘటనలో ఓ సీఆర్పీఎఫ్ జవాన్‌తో పాటు పౌరుడు మరణించారు. అయితే ఓ తాత, మనవడు కలిసి వెళ్తుండగా, ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ పెట్రోల్ పార్టీపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తాతతో పాటు ఓ మూడేళ్ల పిల్లాడు కూడా ఉన్నాడు.
ఉగ్రవాదులతో పోరాడుతూ బాలున్ని కాపాడిన జవానుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రక్తపు మడుగులో ఉన్న తాతను చూసి ఏడ్చుకుంటూ లేపే ప్రయత్నం చేశాడు. శవం వద్ద కూర్చుని ఏడుస్తూ బిక్కుబిక్కుమంటూ ఉండిపోయాడు. ఆ సమయంలో జవాను ఆ పిల్లాడిని ఎత్తుకుని సురక్షిత ప్రాంతానికి తరలించాడు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.