అమ్మ అకౌంట్లోకి ప్రతినెలా జమ అవుతున్న నగదు..

సోమవారం, 28 జనవరి 2019 (10:55 IST)
తమిళనాడు సీఎం జయలలిత మరణించి రెండేళ్లు గడిచినా... ఆమె బ్యాంకు ఖాతాలో మాత్రం నగదు తరగట్లేదు. జయలలిత బ్యాంక్ అకౌంట్లో క్రమం తప్పకుండా ప్రతినెలా నగదు జమ అవుతోందని ఐటీ అధికారులు తెలిపారు. జయ సొంత భవనాల్లో నివసిస్తున్నవారు.. దుకాణాలు నడుపుతున్నవారు.. అద్దెలను అమ్మ అకౌంట్లోకి ప్రతినెల జమచేస్తున్నారని ఐటీ అధికారులు తెలిపారు. 
 
జయకు చెందిన చెన్నై మందవల్లి, అన్నాశాలైలోని కొన్ని భవనాలు అద్దెకు వదలడం జరిగింది. వీటి నుంచి జయలలిత అకౌంట్‌ను భారీ మొత్తాన నగదు జమ అవుతుందని ఐటీ తెలిపింది. కాగా జయలలిత రూ.16.74 కోట్లకు పైగా ఆస్తిపన్నులు చెల్లించని కారణంగా ఆమెకు చెందిన 4 స్థిరాస్తులను అటాచ్‌ చేసినట్లు ఇటీవల హైకోర్టులో ఐటీ శాఖ నివేదికను సమర్పించారు. 
 
ఆమె ఖాతాలలో నగదును జమచేస్తున్నవారి వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. 2016, డిసెంబరు 5న ఆమె మృతి చెందేనాటికే ఆమె చెల్లించాల్సిన ఆస్తి పన్నులు రూ.20 కోట్లు దాటినట్లు తెలుస్తోంది. జయ అధికారిక వారసులెవరనే విషయం తేలకపోవడంతో ఐటీకి జయ తరఫు ఆస్తిపన్నులను ఇప్పటికిప్పుడు ఎవరూ చెల్లించలేని పరిస్థితి ఉందన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు