నిద్రపోయే వారికి లక్ష.. నిద్రలో ఛాంపియన్‌గా నిలిస్తే.. రూ.10లక్షలు

మంగళవారం, 2 మార్చి 2021 (18:51 IST)
ఉరుకులు పరుగుల మధ్య చాలామంది నిద్రకు ప్రాధాన్యం ఇవ్వటం లేదు. దీంతో అనారోగ్య సమస్యలు తప్పట్లేదు. నిద్ర మనిషికి చాలా ముఖ్యమని రోజుకు 8 గంటల నిద్ర అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. అయితే నిద్రకు గల ప్రాధాన్యతను తెలియజేస్తూ.. బెంగళూరుకు చెందిన వేక్ ఫిట్ సంస్థ స్లీప్ కాంపిటిషన్ నిర్వహిస్తోంది. దీని ప్రకారం sleep internshipను ప్రకటించింది. తద్వారా ప్రజల నిద్రపై అధ్యయనం చేపట్టనుంది వేక్ ఫిట్.
 
సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్లను ఉపయోగించకుండా..  హాయిగా నిద్రపోయే వారికి 100 రోజులు.. రోజూ తొమ్మిది గంటలు నిద్రించే వారికి రూ.1లక్ష ప్రైజ్ మనీ ఇవ్వనునున్నట్లు ప్రకటించింది. అంతేగాకుండా sleep internshipలో ‘స్లీప్ ఛాంపియన్ ఆఫ్ ఇండియా’ కిరీటం పొందటానికి, రూ .10 లక్షల బహుమతిని సంపాదించడానికి అవకాశం ఉంది. కంపెనీకి ఇప్పటివరకు 3 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ప్రవేశించడానికి, మీకు కావలసిందల్లా ఏ రంగంలోనైనా పూర్తి చేసిన డిగ్రీ, హాయిగా నిద్రపోయే సామర్థ్యం మాత్రమే.
 
2020 కఠినమైన సంవత్సరం. కరోనా పాండమిక్ ఒత్తిడి, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి కారణాల చేత ఆలస్యంగా నిద్రపోయే గంటలు ఎక్కువయ్యాయి. ఇంకా తక్కువ నిద్రనే మిగిల్చివుంటాయి. ఈ సంవత్సరం, నిద్ర ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో అవగాహన కల్పించేందుకు నిర్ణయించాం. హాయి నిద్రను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం, అభ్యర్థులకు ఆహ్లాదకరమైన, చిరస్మరణీయమైన అనుభవం ఉండేలా చూసుకోవాలని వేక్ ఫిట్.కో సహ వ్యవస్థాపకుడు చైతన్య రామలింగెగౌడ చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు