ప్రస్తుతానికి ఈశాన్య రాష్ట్రాలకు చెందిన చిన్న, సన్నకారు రైతులు, మహిళా రైతులు, రైతులకు డ్రోన్‌ల ధరలో 50 శాతం చొప్పున గరిష్టంగా రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ఇతర రైతులకు డ్రోన్‌ల కొనుగోలుకు 40 శాతం లేదా గరిష్టంగా రూ. 4 లక్షల వరకు సబ్సిడీ ఇస్తున్నారు.
డ్రోన్ల సాయంతో రైతులు ఎరువులు, ఇతర పురుగులు మందులను సులభంగా వేయవచ్చు. దీంతో రైతులకు చాలా సమయం ఆదా అవుతుంది. దీనితో పాటు పురుగుమందులు, మందులు, ఎరువులు కూడా ఆదా అవుతుంది.