తల్లిదండ్రులూ జాగ్రత్త.. జెల్లీ మిఠాయి తిని చిన్నారి మృతి

సోమవారం, 19 ఆగస్టు 2019 (11:03 IST)
అవును. జెల్లీ మిఠాయి కొనివ్వమని మారాం చేస్తే పిల్లలకు అస్సలు కొనివ్వకండి ఎందుకంటే.. జెల్లీ మిఠాయిని తిన్న చిన్నారి, తల్లి కంటిముందే స్పృహ తప్పి పడిపోయి... ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాడు, పెరంబళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెరంబళూరు జిల్లా, అన్నై నగర్ ప్రాంతానికి చెందిన ధర్మరాజ్ భార్య శశిదేవి. 
 
ఈమె తన నాలుగేళ్ల కుమారుడు రంగనాథన్‌ను తీసుకుని షాపుకు వెళ్లింది. ఇలా ఓ కొట్టులో ఐదు రూపాయలకు అమ్మబడే జెల్లీ మిఠాయిని రంగనాథన్‌కు కొనిపెట్టింది. దీన్ని తినిన ఆ చిన్నారి స్పృహ తప్పి పడిపోయాడు. 
 
వెంటనే కుమారుడిని ఆస్పత్రిలో చేర్చిన శశిదేవికి వైద్యులు షాకిచ్చే నిజాన్ని చెప్పారు. అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. దీంతో శశిదేవి బోరున విలపించింది. జెల్లీ మిఠాయి గొంతులో చిక్కుకుపోవడం ద్వారానే చిన్నారి ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు