నా భార్య రహస్య అందాలు చూసి తరించండి... నీలి చిత్రాలు షేర్ చేసిన భర్త

సోమవారం, 9 సెప్టెంబరు 2019 (11:28 IST)
కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే పరమ దుర్మార్గపు చర్యకు పాల్పడ్డాడు. భార్య రహస్య అందాలను నెట్టింట్లో షేర్ చేశాడు. భార్య రహస్య చిత్రాలను సోషల్‌ మీడియాలో షేర్ చేయడమే కాకుడా, ఆమెను చిత్ర హింసలకు గురిచేశాడు. ఆ వేధింపులను భరించలేని భార్య పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు కేసు విచారిస్తున్నారు. 
 
కాగా, హర్యానా రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి గుర్గావ్‌లో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి 12 ఏళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలం పాటు సంతోషంగానే సాగిన వీరి వైవాహిక జీవితంలో మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇక తమ వివాహ జీవితానికి ముగింపు పలకాలని భార్యభర్తలిద్దరూ నిర్ణయించుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో స్థానిక కోర్టులో విడాకుల కోసం ధరఖాస్తు చేసుకున్నారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉంది. అయితే, భార్యపై పగ పెంచుకున్న భర్త... ఆమె రహస్య అందాలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. భార్యాభర్తలిద్దరూ ఏకాంతంగా ఉన్నపుడు రహస్యంగా తీసిన ఫోటోలను పోస్ట్ చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఆమె ఫిర్యాదు స్వీకరించిన మానేశ్వర్‌ పోలీసులు, కేసును మహిళా, సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు బదిలీ చేసి విచారణకు ఆదేశించారు. దీనిపై మహిళా స్టేషన్‌ అధికారి కవిత మాట్లాడుతూ.. ఐపీసీ సెక్షన్‌ 509 కింద కేసు నమోదు చేశామని, విచారణ అనంతరం అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు