హర్యానా రాష్ట్ర నగర శివారు ప్రాంతమైన కర్నాల్ టోల్ ప్లాజా వద్ద ఓ మహిళపై అత్యాచారం జరిగింది. ఈ దారుణానికి ఇద్దరు దుండగులు పాల్పడ్డారు. ఈ టోల్ ప్లాజా సమీపంలోని మరుగుదొడ్డికి బహిర్భూమికి వెళ్లగా ఈ దారుణం జరిగింది. మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన కీచకులు వెళ్తూ వెళ్తూ మరీ తమ మొబైల్ నంబర్లు ఇచ్చిమరీ వెళ్లారు. హర్యానాలోని కర్నాల్ జిల్లాలో ఫిబ్రవరి 16, ఆదివారం రాత్రి ఈ దారుణం జరిగింది.
ఈ క్రమంలో మహిళ(19) టాయ్లెట్ కోసం వెళ్లింది. స్థానికంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఇది గమనించి, ఆ మహిళను వెంబడించారు. మహిళ టాయిలెట్లోంచి తిరిగి వస్తుండగా ఆమెను అడ్డగించి కత్తితో బెదిరించి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళారు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశారు.
దీనిపై మరుసటిరోజు ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు... వారిచ్చిన మొబైల్ ఫోన్ల ఆధారంగా కామాంధులను అరెస్టు చేశారు. ఈ కీచకుల్లో ఒకడు టోల్ ప్లాజా సెక్యూరిటీ గార్డు సోనూ కాగా, మరొకడు టోల్ ప్లాజా దగ్గర చిప్స్ అమ్ముకునే మేఘరాజ్గా గుర్తించారు.