ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నాలుగు రోజుల్లోనే దేశంలోకి ప్రవేశిస్తాయని అంచనా వేసింది. సాధారణంగా ఏటా మే 22 నాటికి దక్షిణ అండమాన్ సముద్రంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. అక్కడ నుంచి క్రమంగా వారం, పది రోజుల్లో బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రంలోకి ప్రవేశించి కేరళ తీరాన్ని తాకుతాయి.