ఇంటి భోజనానికి ఓకేగానీ... బెయిల్‌ తుది నిర్ణయం మాత్రం?

గురువారం, 3 అక్టోబరు 2019 (17:12 IST)
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టు అయి తీహార్ జైలులో ఉంటున్న కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంకు ఢిల్లీ హైకోర్టు కాస్త ఊరటనిచ్చింది. ఆయనకు ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, బెయిల్‌పై తుది నిర్ణయాన్ని మాత్రం ప్రధాన న్యాయమూర్తి వెల్లడించనున్నారు. 
 
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టు అయివున్న చిదంబరంకు క‌స్ట‌డీని పొడిగిస్తూ ఢిల్లీ హైకోర్టు బుధవారం మరోమారు ఆదేశాలు జారీచేసింది. తొలుత ఇచ్చిన 14 రోజుల రిమాండ్ గ‌డువు ముగియ‌డంతో.. చిదంబ‌రాన్ని సీబీఐ కోర్టు ముందు ప్ర‌వేశ‌పెట్టింది. అడిష‌న‌ల్ సెష‌న్స్ జ‌డ్జి ఏకే కుహ‌ర్ ఈ కేసులో అరెస్టు గ‌డువును పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చారు. 
 
అయితే ప్ర‌స్తుతం తీహార్ జైలులో ఉంటున్న చిదంబ‌రానికి కోర్టు కొంత ఊర‌ట క‌ల్పించింది. ఇంటి నుంచి తెచ్చిన భోజ‌నాన్ని తినేందుకు ఆయ‌న‌కు ప‌ర్మిష‌న్ ఇచ్చింది. వైద్య స‌దుపాయం కోసం బ‌య‌ట ఆస్ప‌త్రుల‌కు వెళ్లేందుకు కూడా కోర్టు అంగీక‌రించింది. మరోవైపు బెయిల్‌ కోసం చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 
 
చిదంబ‌రం త‌ర‌పున సీనియ‌ర్ న్యాయ‌వాది క‌పిల్ సిబ‌ల్ కోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ పిటిషన్‌ప జస్టీస్ ఎన్వీ రమణ సారథ్యంలోని బెంచ్ విచారణ జరుపనుంది. కానీ, తీర్పును మాత్రం ప్రధాన న్యాయమూర్తి వెల్లడించనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు