వేర్పాటువాద సంస్థ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ డే చీఫ్ అమృతపాల్ సింగ్ పోలీసుల చేతికి చిక్కినట్టే చిక్కి చేజారిపోయాడు. ఆయన శనివారం పోలీసుల చేతికి చిక్కి తప్పించుకున్నారు. అమృతపాల్‌ను అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందం పోలీసులు ఆయన ఉన్న చోటికి వెళ్ళగా, ఆయన పోలీలకు కన్నుగప్పి తప్పించుకున్నాడు. ఆ తర్వాత ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు దాదాపు వందకు పైగా కార్లలో ఛేజ్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
దీనిపై పంజాబ్ పోలీసులు స్పందిస్తూ, తమ కళ్లుగప్పి తప్పించుకున్న అమృతపాల్ సింగ్‌ను అరెస్టు చేసేందుకు ఆదివారం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం ఏడు జిల్లాలో భారీ ఆపరేషన్ చేపట్టామని, ఈ ఏడు జిల్లాల్లో అనుమానాస్పద ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీ చేస్తున్నట్టు వారు తెలిపారు. ఈ క్రమంలోనే వారిస్ పంజాబ్ దేకు చెందిన 78 మందిని అరెస్టు చేసినట్టు చేశారు. మరోవైపు అమృతపాల్ సింగ్ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు సాగుతున్నందున పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.