ప్రేయసిని పెళ్లాడేందుకు డాక్టర్‌ను కిడ్నాప్ చేశాడు..

శనివారం, 6 ఫిబ్రవరి 2021 (09:43 IST)
ఓ యువకుడు తన ప్రేయసిని పెళ్లాడేందుకు డాక్టర్‌ను కిడ్నాప్ చేసిన ఘటన అలీఘర్‌లో గత నెలలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. అనుజ్ చౌదరి అనే యువకుడు ఓ యువతిని గత కొంత కాలం నుంచి ప్రేమిస్తున్నాడు. ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు.

కానీ అతని వద్ద డబ్బు లేకపోవడంతో.. డాక్టర్‌ను కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేయాలనుకున్నాడు. దీంతో స్థానికంగా ఉన్న డాక్టర్‌ను కిడ్నాప్ చేసి రూ. 20 లక్షలు డిమాండ్ చేశాడు. డాక్టర్ కిడ్నాప్‌కు అనుజ్ స్నేహితులు నలుగురు సహకరించారు. 
 
అయితే కుటుంబ సభ్యులు కిడ్నాపర్లు ఫోన్ చేసిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనవరి 28న డాక్టర్ కిడ్నాప్‌కు గురికాగా, 30వ తేదీన కిడ్నాపర్ల నుంచి పోలీసులు ఆయనకు విముక్తి కల్పించారు. అనుజ్‌తో పాటు మిగతా నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల వద్ద ఉన్న తుపాకులు, ఇతర వస్తువులను పోలీసులు సీజ్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు