వారిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కులాలు వేరు, మతాలు వేరు.. అయినా ఒక్కటవ్వాలనుకున్నారు. పెద్దలను ఒప్పిద్దామనుకున్నారు. ప్రేమించినవాడితో కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామనుకున్న ఆ యువతి కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. తన కుటుంబ సభ్యులే తన ప్రియుడిని అతి కిరాతకంగా చంపుతుంటే చూస్తూ ఉండిపోయింది.
తమ కుమార్తెను వేరే కులం వాడు ప్రేమించాడని, ఆమె ప్రేమించిన వ్యక్తి మర్మాంగాన్ని కోసి అతి కిరాతకంగా హత్య చేశారు యువతి కుటుంబ సభ్యులు. బీహార్లో జరిగిన ఈ దారుణ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో పోలీసులు త్వరగానే పురోగతి సాధించారు. హత్య కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి, కీలక నిందితుడిగా భావిస్తున్న సుశాంత్ పాండే అనే యువకుడిని అరెస్టుచేశారు. మిగతా ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.