గోవా-కర్ణాటక బోర్డర్ లోని ప్రఖ్యాత దూద్‌సాగర్ జలపాతం దగ్గర ఈ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. భారీ వర్షాల కారణంగా రైలు పట్టాలపై కొండ చరియలు విరిగి పడడంతో మంగళూరు నుంచి ముంబయి వెళ్తున్న రైలు (01134) సోనాలిమ్- దూద్‌సాగర్ స్టేషన్ల మధ్య ప్రమాదానికి గురైంది. రైలు ఇంజిన్, మొదటి జనరల్ బోగీ పట్టాలు తప్పింది.
అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగ లేదని సౌత్ వెస్ట్రన్ రైల్వే అధికారులు తెలిపారు. పట్టాలు తప్పిన బోగీల్లోని ప్రయాణికులను వెంటనే వేరే బోగోల్లోకి తరలించారు. అదే సమయంలో దూద్‌సాగర్-కరన్ జోల్ రైల్వే స్టేషన్ల మధ్య కూడా పట్టాలపై కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో మంగళూరు-ముంబై రైలుని రూట్ మార్చి తిరిగి కులెమ్ రైల్వే స్టేషన్ కి తీసుకెళ్లారు.