నో పార్కింగ్ జోన్‌లో పార్కింగ్ చేసివున్న కారులో కూర్చొని ఓ మహిళ తన బిడ్డకు పాలిస్తోంది. అయినా ఖాకీలు ఏమాత్రం కనికరం చూపకుండా ఈడ్చుకెళ్లారు. అంటే, సామాన్య ప్రజల పట్ల కొందరు పోలీసులు ఎంత అమానుషంగా ప్రవర్తిస్తారో ఈ సంఘటన మరోమారు కళ్ళకుకట్టింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
ఈనెల పదో తేదీన శుక్రవారం ముంబైలోని మలాడ్ వెస్ట్ వద్ద శశాంక్ రాణే అనే ట్రాఫిక్ కానిస్టేబుల్, మరికొందరు కానిస్టేబుళ్ళు కలిసి ‘నో పార్కింగ్’ ఏరియాలో కారు ఉన్న కారును తమ కారుకు కట్టేసి బలవంతంగా ఈడ్చుకుపోయారు.
ఆసమయంలో కారులో ఓ మహిళ తన 7 నెలల బిడ్డకు పాలు ఇస్తూ ఉన్నారు. బిడ్డకు పాలివ్వడాన్ని చూసి కానిస్టేబుళ్లు... ఏమాత్రం కనికరం చూపకుండా తమ కారుకు కట్టేసి బలవంతంగా ఈడ్చుకెళ్లారు. ఆ విధంగా ఆ కారును తల్లీబిడ్డలతోపాటు ఈడ్చుకుపోతున్నపుడు ఓ వ్యక్తి శశాంక్ రాణే అనే కానిస్టేబుల్‌ను గట్టిగా ప్రశ్నించినప్పటికీ ఎటువంటి ఫలితం కనిపించలేదు.