ముంబైలో గర్భిణీలకు కరోనా.. పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు..

గురువారం, 23 ఏప్రియల్ 2020 (20:37 IST)
మహారాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ముంబైలోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబైలోని ఇద్దరు గర్భిణీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అయినప్పటికీ ఆ ఇద్దరు గర్భిణిలు ముంబయి నానావతి ఆస్పత్రిలో పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు. 
 
దక్షిణ ముంబైకి చెందిన 35 ఏళ్ల మహిళ.. ఆడబిడ్డకు జన్మనిస్తే, మరో 25 ఏళ్ల మహిళ మగబిడ్డకు జన్మినిచ్చింది. ఈ ఇద్దరు పసిబిడ్డల పట్ల వైద్యులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
 
కరోనా సోకిన గర్భిణిలకు అంతర్జాతీయ కేస్‌ స్టడీస్‌ను ఆధారం చేసుకుని, ప్రసూతి, గైనకాలజీ డిపార్ట్‌మెంట్స్‌, పీడియాట్రిక్‌ డిపార్ట్‌మెంట్‌ సూచనల మేరకు ప్రసవాలు చేస్తున్నామని వైద్యులు చెప్తున్నారు. తల్లులకు, బిడ్డలకు మధ్య సంబంధం లేకుండా వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఇంకా గర్భిణులు పండంటి బిడ్డలకు జన్మనివ్వడంతో వైద్యులు, నర్సులు హర్షం వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు