ఇది ఉద్యోగాలు చేస్తున్న మహిళలందరికీ వర్తిస్తుందన్నారు. గురువారం కటక్‌లో జరిగిన ఇండిపెండెన్స్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న డిప్యూటీ సీఎం ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. ఉద్యోగుల ఆరోగ్యం, శ్రేయస్సును కాంక్షిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగినులు ప్రభుత్వ నిర్ణయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సామాజిక కార్యకర్త నమ్రతా చద్దా కూడా హర్ష వ్యక్తం చేశారు. మరోవైపు ప్రస్తుతం బీహార్, కేరళ ప్రభుత్వాలు మాత్రమే మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు ఇస్తున్నాయి.
ప్రభుత్వాలతో పాటు కొన్ని యూనివర్సిటీలు కూడా నెలసరి సెలవులను ప్రకటించాయి. వాటిల్లో హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్శిటీ ఆఫ్ లా, తేజ్ పూర్, అస్సాంలోని గుహవాటి, చండీగఢ్ లోని పంజాబ్ యూనివర్సిటీల విద్యార్థినులకు నెలసరి సెలవులు ప్రకటించాయి.