రూ.2 కోట్ల బీమా కోసం కిరాయి ముఠాతో భార్య హత్య - భర్త అరెస్టు

శుక్రవారం, 2 డిశెంబరు 2022 (08:42 IST)
కట్టుకున్న భార్యపై ఉన్న రూ.1.90 కోట్ల బీమాను కొట్టేయాలన్న నిర్ణయానికి వచ్చిన భర్త ఆమెను దారుణంగా హత్య చేయించాడు. రాజస్థాన్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ రాష్ట్రంలోని జైపూర్‌కు చెందిన చంద్ అనే వ్యక్తి షాలును గత 2015లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. రెండేళ్ళ తర్వాత వారి మధ్య పొరపొచ్ఛాలు వచ్చాయి. దీంతో షాలు తన పుట్టింటికి వెళ్లిపోయి అ్కకడే ఉంటుంది. 
 
గత 2019లో భర్తపై గృహహింస కేసు కూడా పెట్టింది. ఈ నేపథ్యంలో ఇటీవల షాలు పేరుపై చందు బీమా చేయించాడు. పైగా, తాను ఓ కోరిక కోరుకున్నానని, అది నెరవేరాలంటే 11 రోజుల పాటు ప్రతి రోజూ బైకుపై హనుమంతుడి గుడికి వెళ్ళాలని భార్యకు చెప్పాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని కూడా హెచ్చరించాడు. 
 
తన కోరిక నెరవేరిన వెంటనే ఇటికి తీసుకెళతానని భార్యకు హామీ ఇచ్చాడు. భర్త మాటలు నమ్మిన ఆమె ప్రతి రోజూ బైకు‌పై ఆంజనేయుడి గుడికి వెళ్లి రావడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో గత అక్టోబరు నెల 5వ తేదీన కజిన్ రాజుతో కలిసి ఆమె బైకుపై ఆలయానికి వెళ్ళింది. అప్పటికే అక్కడ ముగ్గురితో కలిసివున్న చందు... రాథోడ్ అనే రౌడీషటర్ కారుతో ఆమెను ఛేజ్ చేసి ఢీకొట్టించాడు. 
 
ప్రమాద సమయంలో రాథోడ్‌తో కలిసి కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. రాథోడ్, సోనులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఆ తర్వాత హత్య కోసం రూ.10 లక్షలతో ఒక ఒప్పందం కుదుర్చుకుని, ముందస్తు రుసుంగా రూ.5.5 లక్షలు చెల్లించాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు