ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసింది వీరే....

వరుణ్

ఆదివారం, 9 జూన్ 2024 (22:31 IST)
దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మంత్రివర్గంలో మరో 72 మందికి చోటు కల్పించారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు మంత్రులు ఉన్నారు. వీరిలో ఏపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మలు ఉన్నారు. అలాగే, తెలంగాణ నుంచి సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌లు ఉన్నారు. వీరందరితీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. అనంతరం కొత్త మంత్రిమండలితో రాష్ట్రపతి గ్రూప్ ఫొటో దిగారు.
 
తెలుగు రాష్ట్రాల నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, శ్రీనివాస వర్మలు హిందీలో ప్రమాణం చేశారు. టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లు ఇంగ్లీష్ ప్రమాణం చేశారు. త్రిస్సూర్ బీజేపీ ఎంపీ సురేశ్ గోపి, జయంత్ చౌదరి, మురుగన్ ఇంగ్లీష్లో ప్రమాణం చేశారు. మోడీతో సహా మెజార్టీ సభ్యులు హిందీలో ప్రమాణం చేశారు. మిత్రపక్షాలకు 11 బెర్తులను ప్రధాని మోడీ కేటాయించారు. అయితే, వారికి కేటాయించాల్సిన శాఖల వివరాలను మాత్రం ఇంకా బహిర్గతం చేయలేదు.
 
మరోవైపు, మంత్రులుగా ప్రమాణం చేసిన 72 మంది మంత్రుల పేర్లను పరిశీలిస్తే, 
 
ప్రధానిగా నరేంద్ర మోడీ తొలుత ప్రమాణం చేశారు. ఆ తర్వాత వరుసగా రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, ఎస్.జైశంకర్, మనోహర్ లాల్ ఖట్టర్, హెచ్.డి.కుమారస్వామి, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, జితిన్ రామ్ మాంఝి, రాజీవ్ రంజన్ సింగ్ (లాలన్ సింగ్), శరబానంద సోనోవాల్, వీరేంద్ర కుమార్, కె.రామ్మోహన్ నాయుడు, ప్రహ్లాద్ జోషి, జుయల్ ఓరం, గిరిరాజ్ సింగ్, అశ్విని వైష్ణవ్, జ్యోతిరాదిత్య సింధియా, భూపేంద్ర యాదవ్, గజేంద్ర సింగ్ షెకావత్, అన్నపూర్ణాదేవి, కిరణ్ రిజిజు, హర్దీప్ సింగ్ పూరి, మన్సుక్ మాండవీయ, కిషన్ రెడ్డి, చిరాగ్ పాశ్వాన్, సీఆర్ పాటిల్, ఇంద్రజిత్ సింగ్, జితేంద్ర సింగ్, అర్జున్ రామ్ మేఘావాల్, ప్రతాప్ రావ్ జాదవ్‌లు ఉన్నారు. 
 
అలాగే, జయంత్ చౌదరి, జితిన్ ప్రసాద్, శ్రీపాద్ నాయక్, పంకజ్ చౌదరి, కిషన్ పాల్, రాందాస్ అథవాలే, రామనాథ్ ఠాకూర్, నిత్యానంద రాయ్, అనుప్రియా పటేల్, వి.సోమన్న, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎస్పీ సింగ్ భగేల్, శోభా కరండ్లాజే, కీర్తివర్ధన్ సింగ్, బీఎల్ వర్మ, శాంతను ఠాకూర్, సురేశ్ గోపి, డాక్టర్ ఎల్ మురుగన్, అజయ్ టంటా, బండి సంజయ్ కుమార్, కమలేశ్ పాశ్వాన్, భగీరథ్ చౌదరి, సతీశ్ చంద్ర దుబే, సంజయ్ సేథ్, రవ్ నీత్ సింగ్, దుర్గాదాస్ ఉయికే, రక్షా నిఖిల్ ఖడ్సే, సుఖాంత్ మజందార్, సావిత్రీ ఠాకూర్, తోకన్ సాహు, రాజ్ భూషణ్ చౌదరి, భూపతిరాజు శ్రీనివాస వర్మ, హర్ష్ మల్హోత్రా, నిముబెన్ బంభానియా, మురళీధర్ మొహోల్, జార్జ్ కురియన్, పబిత్ర మార్గరెటా ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు