1947లో దేశ విభజన సమయంలో తమ తండ్రి గ్యాన్‌చంద్ర పంజాబ్ నుంచి వలస వచ్చి ఫైజాబాద్(అయోధ్య) జిల్లాలో స్థిరపడ్డారని రాణి కపూర్ అలియాస్ రాణి బలుజా, రమా రాణి పంజాబి అనే ఇద్దరు సోదరీమణులు తమ రిట్ పిటిషన్‌లో పేర్కొన్నారు.
అయితే తరువాత తమ తండ్రి పేరును రికార్డుల నుంచి తొలగించారని, దీనిపై ఆయన ఆయోధ్య అడిషనల్ కమిషనర్‌ను ఆశ్రయించినట్లు చెప్పారు. కన్సాలిడేషన్ చర్యల్లో భాగంగా అధికారి మరళా తమ తండ్రి పేరును తొలగించగా, దీనిపై సెటిల్‌మెంట్ ఆఫీసర్ ముందు అప్పీల్ చేశామని కోర్టుకు తెలిపారు.