అతడు ఇంటిలోకి ప్రవేశించేటప్పటికి ఇద్దరు అబ్బాయిలు ఏదో విషయమై తన భార్యతో గొడవకు దిగుతున్నారు. వారిని అలాంటి స్థితిలో చూసిన భర్త కోపంతో ఊగిపోయాడు. బంధువులను, గ్రామస్థులను పిలిచి వారిని చితక బాదారు. అబ్బాయిలిద్దరినీ తాళ్లతో చేతులు కట్టేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు రెండు వర్గాలకు నచ్చజెప్పి గొడవను సద్దుమణిగేలా చేసారు.