గరికను సంకష్టహర చతుర్థి రోజు ఆయనకు సమర్పించడం ద్వారా ఈతిబాధలు, అడ్డంకులు, అప్పుల బాధలు తొలగిపోతాయి. గరిక లేనిదే వినాయక పూజ చేయకూడదు. అలాగే సంకష్టహర చతుర్థి రోజున ఆలయాల్లో విశేష తీర్థాన్ని భక్తులకు ఇస్తారు.
ఈ తీర్థంలో గరిక, పచ్చకర్పూరం, ఏలకులు, జాజికాయను వేస్తారు. ఈ తీర్థాన్ని సేవించడం ద్వారా కార్యసిద్ధి చేకూరుతుంది. ఇంకా సకల దోషాలు తొలగిపోతాయి. జీవితంలో సుఖం చేకూరుతుంది.