చీర విప్పమన్నారు.. షార్ట్స్ వేసుకోమన్నారు.. దళిత మహిళ దాష్టీకం

సెల్వి

సోమవారం, 5 ఆగస్టు 2024 (08:58 IST)
తెలంగాణలో పోలీసులు దళిత మహిళను చిత్ర హింసలకు గురిచేశారనే ఆరోపణలు వస్తున్నాయి. షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో తనను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని ఒక దళిత మహిళ ఆరోపించింది.
 
బంగారం దొంగిలించారనే ఆరోపణలపై మహిళను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, ఆమె మైనర్ కొడుకు సమక్షంలోనే దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన మహిళ..  తన భర్తను మొదట కొట్టి, ఆపై విడిచిపెట్టినట్లు తెలిపింది. 
 
ఆ తర్వాత ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించారు. చీరను విప్పమని.. షార్ట్స్ వేసుకోమని బలవంతం చేశారు. పోలీసులు ఆమెపై దాడి చేసే ముందు కాళ్లు, చేతులు కట్టేశారు. ఎంత వేడుకున్నప్పటికీ, తనను విడిచిపెట్టలేదని మహిళ ఆరోపించింది.  
 
ఈ ఆరోపణలపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతీ మాట్లాడుతూ.. షాద్‌నగర్‌కు చెందిన డిఐ (డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్) ఆరోపణలపై విచారణ పెండింగ్‌లో ఉన్నందున కమిషనరేట్ ప్రధాన కార్యాలయానికి ఈ కేసును అటాచ్ చేసినట్లు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు