తెలంగాణాలోని ఆ జిల్లాలకు వర్ష సూచన : వాతావరణ శాఖ

ఠాగూర్

సోమవారం, 12 ఆగస్టు 2024 (12:03 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఓ సూచన చేసింది. అనేక జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. ముఖ్యంగా వర్షం కురిసే సమయంలో బయటకు వెళ్లకపోవడమే మంచిదని కోరింది. 
 
ముఖ్యంగా, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. 
 
గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షం కురిసే సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిదని తెలిపింది. 
 
హైదరాబాద్ నగరంలో రేపు ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం తర్వాత జల్లులు కురిసే అవకాశముందని తెలిపింది. మధ్యాహ్నం కాస్త ఎండ వచ్చినప్పటికీ సాయంత్రానికి వాతావరణం చల్లబడి జల్లులు కురిసే అవకాశముందని వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు