ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహం కూల్చారు.. వీడియో వైరల్ (video)

సెల్వి

సోమవారం, 14 అక్టోబరు 2024 (14:28 IST)
Secunderabad
ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌ కుమ్మరిగూడలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రి ఆలయంలో శబ్దం రావడంతో మేల్కొన్న స్థానికులు.. ముగ్గురిలో ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
 
కేసు నమోదు చేసిన పోలీసులు పరారైన వారి కోసం గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కాగా, విషయం తెలుసుకున్న బీజేపీ, హిందూ సంఘాల కార్యకర్తలు ఆలయం వద్దకు భారీగా చేరుకున్నారు. 
 
గుడిపై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని ధర్నాకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. 
 
అనంతరం మాజీ మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ..  విగ్రహం ధ్యంసం చేయడం ఒక వర్గం మనోభావాలను దెబ్బతీయడమేనని చెప్పారు. దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలన్నారు. 

My Blood Is Bleeding After Seeing This Visuals Of Jihadi Vandising The #Muthayalamma Idol At Kummarguda Secbad. Will @TelanganaCMO Take The Action On These Jihadis. We Want Justice. @BJP4India @BJYM @BJP4Telangana @kishanreddybjp @bandisanjay_bjp @Sagar4BJP pic.twitter.com/auCYrO2JDn

— Kompally Arvind Kumar ???????????????????????? (@AneArvind) October 14, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు