పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పింఛన్తో బాధితురాలు దుర్గవ్వ(68) జీవిస్తోంది. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వృద్ధులకు నెలకు రూ.2,000 పింఛను అందుతోంది. ఆ డబ్బుతో దుర్గవ్వ భోజనం పెట్టేది.
అయితే రామచంద్రం ఆమె నుంచి డబ్బు లాక్కునేవాడు. ఈ నెల, ఆమె ఫించన్ డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో, ఆగ్రహానికి గురైన రామచంద్రం ఆమెను కొట్టి చంపాడు. రామచంద్రంపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.