ప్రధానంగా ఆసిఫాబాద్, ములుగు, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, ఖమ్మం, సూర్యాపేట, పాలమూరు, హన్మకొండ, వరంగల్, నల్గొండ, జనగాం, యాదాద్రి భవనగిరి జిల్లాల్లో ఈ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది.
ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం పూట బయటకు రావొద్దని హెచ్చరించింది. కాగా, బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామపురంలో అత్యధికంగా 40.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.