అభ్యర్థుల ఎంపికలో బీజేపీ సామాజిక న్యాయాన్ని అనుసరిస్తుందనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. సీట్ల కేటాయింపులో మహిళలు, బీసీలకు పెద్దపీట వేసినట్లు చెబుతున్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీలను రాజకీయ బానిసలుగా చూస్తున్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. వాళ్ల ఓట్లు కావాలి కానీ సీట్లు ఇచ్చేది లేదని దుయ్యబట్టారు.
మహిళల కోసం కవిత ఢిల్లీలో ధర్నాలు చేశారని, అయితే ఆ పార్టీ మహిళలకు సీట్లు ఇవ్వలేదని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మహిళలను పక్కన పెట్టాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థుల ఎంపికలో బీజేపీ సామాజిక న్యాయాన్ని అనుసరిస్తోందని వివరించారు.