ఏసాలో ఏసాలు... ఉదయం పాడె మోసి.. సాయంత్ర అన్నం తినిపించి..
మంగళవారం, 23 అక్టోబరు 2018 (18:27 IST)
అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థులు ప్రకటించిన గులాబీ దళం ప్రజాక్షేత్రంలో కలియతిరిగి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నానా పాట్లూ పడుతున్నారు. అక్కా, అన్నా, తమ్ముడూ మంచిగున్నావే.. అంటూ అప్యాయంగా పలకరిస్తున్నారు టీఆర్ఎస్ అభ్యర్థులు.
తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి అయితే సోమవారం ఉదయం భూపాలపల్లిలో కిడ్నీల వ్యాధితో బాధపడుతూ చనిపోయిన కిషన్ అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోసారు. సాయంత్రం ఇంటింటా ప్రచారానికి వెళ్లి ఓ పెద్దాయన అన్నం తింటుంటే వెళ్లి అన్నం తినిపించారు.. ఎన్నికల వేళ నేతల ఎన్ని సిత్రాలు చూడాల్సి వస్తుందో అనుకుంటున్నారు ఓటర్లు.