మృత్యుబావి కేసు.. వరంగల్ కోర్టు సంచలన తీర్పు.. నిందితుడికి ఉరిశిక్ష

బుధవారం, 28 అక్టోబరు 2020 (18:52 IST)
మృత్యుబావి కేసులో వరంగల్‌ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. గొర్రెకుంటలో జరిగిన ఈ తొమ్మిది మంది హత్యలకు కారకుడైన సంజయ్‌కు ఉరి శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఒక హత్యకు కప్పిపుచ్చుకునేందుకు మరో తొమ్మిది మందిని హత్యలకు కారకుడైన సంజయ్‌కు ఉరి శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 
 
కాగా, మే 21న గీసుకొండ మండలం గొర్రెకుంట శివారులో పాడుబడిన బావిలో తొమ్మిది మందిని హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతులందరికి ఆహారంలో నిద్రమాత్రలు కలిపిన నిందితుడు సంజయ్‌ వారు మత్తులోకి జారుకోవడంతో హత్య చేసి బావిలో పడేశాడు. ముందుగా మహిళ హత్యను కప్పిపుచ్చుకునేందుకు నిందితుడు సంజయ్‌కుమార్‌ యాదవ్‌ మరో 9 మందిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. 
 
అయితే కేసు నమోదైనప్పటి నుంచి కేవలం ఐదు నెలల వారం రోజుల్లో నిందితుడికి శిక్ష పడే విధంగా గీసుకొండ సీఐ శివరామయ్య సాక్షాలు సేకరించి తన పనితనాన్ని ప్రదర్శించారు. 25 రోజుల్లోనే కోర్టు నేరారోపణకు సంబంధించిన పత్రాలు దాఖలు చేశారు. నిందితుడికి ఉరిశిక్ష పడటంపై వరంగల్‌ పోలీసు కమిషనర్‌ ప్రమోద్‌ హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఈ తీర్పు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
ఈ కేసుపై ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు.. కేసులు ఛేదించారు. అయితే 9 మందిని హత్య చేసింది సంజయ్‌ అని తేలింది. మక్సూద్‌ కుటుంబంతో ఉంటున్ను బుస్రాతో వివాహేతర సంబంధం పెట్టుకున్న సంజయ్.. తనకు అడ్డు రావద్దని మక్సూద్‌ కుటుంబంతో పాటు సన్నిహితంగా ఉన్న బీహార్‌కు చెందిన యువకులను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు