తెలంగాణాలో రాజన్న రాజ్యం తెస్తా.. వై.ఎస్. షర్మిల

మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (13:02 IST)
తెలంగాణలో పార్టీ పెట్టనున్నట్లు వస్తున్న వార్తలపై వైఎస్ షర్మిల స్పందించారు. పార్టీకి అంతా సుముఖంగా వున్నట్లు సంకేతాలిచ్చారు. నల్గొండ జిల్లాకు చెందిన కొందరు వైఎస్ అభిమానులతో మంగళవారం ఆమె ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
 
ఈ సమ్మేళనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుడూ నల్గొండ జిల్లాతో పాటు ప్రతీ జిల్లా నేతలను కలుస్తానని ఆమె అన్నారు. తెలంగాణాలో రాజన్న రాజ్యం లేదని ఎందుకు లేదన్నది నా ప్రధాన ఆలోచన అని, అందుకే నేడు నల్గొండ జిల్లా నేతలతో మాట్లాడుతున్నానని అన్నారు.
 
తెలంగాణాలో రాజన్న రాజ్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానన్న ఆమె కచ్చితంగా తీసుకొస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్ లేని లోటు తెలంగాణాలో కనపడుతుందని అందుకే క్షేత్ర స్థాయి పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నానని ఆమె అన్నారు. 
 
తెలంగాణా క్షేత్ర స్థాయి పరిస్థితులు నల్గొండ జిల్లా నేతలకు తెలుసన్న ఆమె అభిమానులకు చెప్పకుండా పార్టీ పెట్టనని అన్నారు. నేటి నుంచి అందరితో మాట్లాడతానని అన్నారు. త్వరలోనే అన్ని విషయాలు ప్రకటిస్తానాని ఆమె పేర్కొన్నారు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు