ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ డైరెక్టర్ అట్లీ సినిమా ఇటీవలే ప్రకటించింది సన్ పిక్చర్స్. అల్లు అర్జున్ కు 22, అట్లీకి 26వ సినిమాగా రూపొందనున్న ఈ చిత్రం జూన్ లో సెట్ పైకి వెళ్ళనుంది. ప్రస్తుతం టెక్నికల్, విజువల్ ఎఫెక్ట్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్ష న్ పనులు జరుగుతున్నాయి. ఇటీవలే అమెరికాలో పలు టెక్నికల్ టీమ్ ను కలిసి వచ్చిన అర్జున్, అట్లీ హాలీవుడ్ హిట్ సినిమాలకు పనిచేసిన వారితో చర్చించి వచ్చారు.