టిల్లు సిరీస్‌లా జాక్ సిరీస్‌కు ప్లాన్ చేసిన దర్శకుడు భాస్కర్

దేవీ

గురువారం, 3 ఏప్రియల్ 2025 (17:53 IST)
Sidhu Jonnalagadda
బొమ్మరిల్లు సినిమాతో పేరు తెచ్చుకున్న భాస్కర్,ఆ తర్వాత అంతటి విజయాన్ని చూడలేకపోయాడు. గేప్ తీసుకున్న సిద్ధూ జొన్నలగడ్డ టాలెంట్ చూశాక ఆయనతో జాక్ సినిమా చేశాడు. టిల్లు లో ఆయన నటన చూశాక జాక్ సినిమా కోసం సీక్వెల్స్ రాసుకున్నట్లు భాస్కర్ తెలియజేశారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం లేటెస్ట్ ట్రైలర్ తో కూడా అలరించింది.
 
జాక్ సినిమా ప్రమోషన్ లో భాగంగానే జాక్ మూడు సినిమా టైటిల్స్ కూడా తెలియజేశారు. ఫస్ట్ పార్ట్ జాక్. రెండో పార్ట్  “జాక్ ప్రో” మూడో పార్ట్ కి “జాక్ ప్రో మ్యాక్స్” అంటూ వెల్లడించారు. ముందుగానే జాక్ యూత్ లో సెస్సేషన్ క్రియేట్ చేస్తుందని ఆయన నమ్ముతున్నారు. అందులో మూడు భాగాలు అనుకున్నాం. మరిన్ని కూడా చేయవచ్చు. సమయం కుదిరితే చేస్తానని తెలిపారు. జాక్ చిత్రం ఈ ఏప్రిల్ 10న విడుదల కాబోతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు