Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

దేవీ

గురువారం, 20 మార్చి 2025 (17:54 IST)
Ram Gopal Varma, Satya Yadu, Aaradhya Devi, Giri Krishna Kamal
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా 'శారీ'.  ఈ చిత్రంలో సత్య యాదు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సైకలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు గిరి కృష్ణ కమల్ రూపొందించారు. ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ నిర్మించారు. 'శారీ' సినిమా ఏప్రిల్ 4న తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషలలో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ రోజు హైదరాబాద్ లో 'శారీ' సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. 
 
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ - మనం ఎవరితోనైనా డైరెక్ట్ గా మాట్లాడినప్పుడు పెద్దగా వారితో కనెక్ట్ కాము. కానీ వాట్సాప్ లాంటి సోషల్ మీడియా యాప్స్ ద్వారా మాట్లాడుకున్నప్పుడు మనం వారిని నేరుగా చూడటం లేదు గనుక త్వరగా వారితో కలిసిపోతాం. మన వ్యక్తిగతమైన విషయాలు కూడా చెప్పేస్తుంటాం. ఒక్కసారి ఎదుటివారికి దగ్గరయ్యాక భయం వల్లో సైకలాజికల్ ఫీలింగ్ వల్లో మరింతగా అటాచ్ అవుతాం. ఇలా పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం వల్ల ఆ తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిఉంటుంది. 'శారీ' సినిమా నేపథ్యమిదే. ప్రాథమికంగా చూస్తే ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్. నేను ఈ చిత్రానికి మూల కథ రాశాను. గిరి కృష్ణకమల్ దర్శకత్వం వహించాడు. ఆరాధ్య చీరకట్టులో చేసిన ఒక రీల్ చూసి ఆమెను కాస్ట్ చేశాం. ఆమె చేసిన పర్ ఫార్మెన్స్ సూపర్బ్ గా అనిపించింది. సత్య ట్రైన్డ్ యాక్టర్. తను బాగా నటించాడు. 'శారీ' సినిమాలో మెసేజ్ ఉంటుందని చెప్పను గానీ ఈ సినిమా చూశాక అమ్మాయిలు జాగ్రత్తపడతారు. 
 
రాజకీయాలు, సినిమాలు వేరు. ఏపీలో మా 'శారీ' సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు. ఏదైనా చట్ట ప్రకారమే జరుగుతుంది. పోసాని గారిని అరెస్ట్ చేస్తే ఆయన సినిమాలు ఆపేయరు కదా. సోషల్ మీడియా మనుషులను దగ్గర చేసేందుకు తయారైంది.  కానీ ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఒకర్ని మరొకరు తిట్టుకోవడానికి పనికొస్తోంది. ఎవరి అభిప్రాయాలు వారు స్వేచ్ఛగా చెప్పడం వల్ల ఇలా జరుగుతోంది. నా సోషల్ మీడియా అక్కౌంట్స్ ద్వారా ఎప్పుడూ అడ్వర్టైజ్ మెంట్స్ చేయలేదు. ఏ సంస్థకు యాడ్స్ చేసినా, అది లీగల్ సంస్థా కాదా అనేది యాక్టర్స్ కు, స్టార్స్ కు తెలియకపోవచ్చు. దానిపై అధికారులు నటీనటులకు అవగాహన కల్పించాలి. అంతేగానీ సడెన్ గా చర్యలు తీసుకోవడం సరికాదు. అన్నారు.
 
డైరెక్టర్ గిరి కృష్ణకమల్ మాట్లాడుతూ - 'శారీ' సినిమాకు డైరెక్షన్ చేసే అవకాశం ఇచ్చిన ఆర్జీవీ గారికి థ్యాంక్స్. ఈ చిత్రాన్ని రూపొందించేప్పుడు నేను స్వతహాగా ఏం చేయగలనో చూపించాలని అనుకున్నాను. మొదట కొంత షూట్ చేసి వర్మ గారికి చూపించాను. ఆయనకు నచ్చింది. ఈ సినిమాకు నాకు ఇద్దరు గొప్ప యాక్టర్స్ సత్య యాదు, ఆరాధ్య రూపంలో దొరికారు. ఆరాధ్య దేవి ఎలా నటిస్తుందో నాకు తెలియదు. ఆమె రీల్స్ మాత్రమే చూశాను. కానీ ఫెంటాస్టిక్ గా నటించింది. సత్య యాదు కొన్ని సీన్స్ లో ఎదుట ఏ యాక్టర్ లేకుండా తనకు తాను పర్ ఫార్మ్ చేయాల్సివచ్చేది. అలాంటి సీన్స్ లో సత్య బాగా నటించాడు. వీరిద్దరు బాగా పర్ ఫార్మ్ చేయడం వల్ల దర్శకుడిగా నాపై ఒత్తిడి తగ్గింది. అన్నారు.
 
హీరోయిన్ ఆరాధ్య దేవి మాట్లాడుతూ - 'శారీ' సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ గారికి థ్యాంక్స్. ఈ సినిమా నాకొక డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ పాత్రలో నటించేందుకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చారు డైరెక్టర్ కృష్ణకమల్. ఈ సినిమా చేయడం నాకొక వర్క్ షాప్ లా అనిపించింది. సత్య యాదు మంచి కోస్టార్. ఆయనతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. 'శారీ' సినిమా ట్రైలర్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఏప్రిల్ 4న థియేటర్స్ లోకి వస్తున్న 'శారీ' సినిమాను చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
 
హీరో సత్య యాదు మాట్లాడుతూ - ఆడిషన్ కోసం అప్లై చేసుకోవడం ద్వారా 'శారీ' చిత్రంలో నటించే అవకాశం దక్కింది. నేను సెలెక్ట్ అయిన తర్వాత ఆర్జీవీ గారు ఫోన్ చేసి మాట్లాడారు. ఆర్జీవీ ఫోన్ చేశాక చాలా హ్యాపీగా ఫీలయ్యాను. మూవీలో నా క్యారెక్టర్ చిన్నదే అయినా కథలో కీలకంగా ఉంటుంది. పాత్రను అర్థం చేసుకుని నటించేందుకు కావాల్సిన స్వేచ్ఛ దర్శకుడు కృష్ణ కమల్ ఇచ్చారు. నాకు కెమెరా ఫియర్ ఉండేది. ఆరాధ్యకు మాత్రం అలాంటిదేం లేదు. బాగా నటించింది. అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు