సమంత నిర్మాతగా ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్న చిత్రం శుభం. ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ మూవీకి వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్లింటన్ సెరెజో సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు సమంత మీడియాతో పలు విషయాలు ముచ్చటించారు.
- ఓ అభిమాని నా కోసం గుడి కట్టారని తెలిసి ఆశ్చర్యపోయాను. నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారా? అని అనుకున్నా. ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. అది అతని ప్రేమను చూపించే తీరు అని అనిపించింది. కానీ ఇలా నాకు గుళ్లు కట్టి, నాకు పూజలు చేసే పద్దతిని మాత్రం నేను ఎంకరేజ్ చేయలేను.