యాక్షన్ చెప్పగానే కబడ్డీ, కబడ్డీ,కబడ్డీ అంటూ మొదలైన ఒక నిమిషం12 సెకండ్ల నిడివిగల ఈ టీజర్ ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. రేయ్ కార్తి..అంటూ రావు రమేష్ పిలవగానే `నన్నెవడైనా అలా పిలవాలంటే ఒకటి మా ఇంట్లో వాళ్లు పిలవాలి లేదా నా పక్కనున్న ఫ్రెండ్స్ పిలవాలి..ఎవడు పడితే వాడు పిలిస్తే వాడి కూత ఆగిపోద్ది` అంటూ గోపిచంద్ చెప్పే డైలాగ్, అలాగే `కబడ్డీ మైదానంలో ఆడితే ఆట..బయట ఆడితే వేట` అనే డైలాగ్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. గోపీచంద్ సీటీ వేయడంతో ఈ టీజర్ ముగుస్తుంది. పవర్‌ప్యాక్డ్ పెర్‌ఫామెన్స్‌లతో స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉన్న ఈ టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.
ఈ సందర్భంగా సంపత్ నంది మాట్లాడుతూ, ``"మా రక్తం, చెమట చిందించి ఎంతో కష్టపడి తెరకెక్కించిన సీటీమార్ టీజర్ ఇవాళ విడుదలైంది. ఈ టీజర్ మీకు చూపించాలని ఎంతగానో ఎదురుచూశాం. మీకు తప్పకుండా నచ్చుతుందని, మీ ప్రేమ, ఆదరాభిమానాలు ఉండాలని కోరుకుంటున్నాను"అన్నారు.
గోపిచంద్, తమన్నా, భూమిక, దిగంగన సూర్యవంశి, పోసాని కృష్ణమురళి, రావు రమేష్, రెహమాన్, బాలీవుడ్ యాక్టర్ తరుణ్ అరోరా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో అప్సర రాణి స్పెషల్ సాంగ్‌లో నటిస్తోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: ఎస్. సౌందర్ రాజన్, సంగీతం: మణిశర్మ, ఎడిటర్: తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్: సత్యనారాయణ డి.వై, సమర్పణ: పవన్ కుమార్, నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సంపత్ నంది.