భారతీయ భాషలతో పాటుగా ఇంగ్లీష్‌లోనూ సమాంతరంగా టాక్సిక్ సినిమాను షూట్ చేస్తున్నారు. ఇలా ఇంగ్లీష్‌లో చిత్రీకరిస్తున్న మొట్టమొదటి భారతీయ చిత్రంగా టాక్సిక్ రికార్డుల్లోకి ఎక్కింది. రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళంతో సహా పలు భారతీయ, అంతర్జాతీయ భాషల్లోకి డబ్ కానుంది. ఈ ప్రాజెక్టుకి అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు.