ఆకాశంలో అద్భుతం, భూమి వైపుగా కొత్త తోకచుక్క

శనివారం, 11 జులై 2020 (21:09 IST)
తోకచుక్క- ఫోటో కర్టెసీ నాసా
సౌరకుటుంబంలోని గ్రహాలలో భూమి ఒకటి, సూర్యుడి నుండి దూరంలో ఇది మూడో గ్రహం. మానవునికి తెలిసిన ఖగోళ వస్తువులలో జీవం ఉన్నది భూమి ఒక్కటే. అయితే ఈ భూమి చుట్టూ ప్రతి నిత్యం తోకచుక్కలూ, గ్రహ శకలాలు తిరుగుతూనే  ఉంటాయి. వాటిలో 95 శాతం మన కళ్లకు కనిపించవు.
 
అలాంటి తోకచుక్కలలో ఈమధ్య కనిపెట్టిన నియోవైజ్ తోకచుక్క మాత్రము ఇప్పుడు భూమికి దగ్గర నుండి వెళ్ళబోతూ మన కంటికి కనిపించనుంది. అయితే ఈ తోకచుక్క ఈ మధ్యకాలంలో బుధగ్రహ కక్ష్యను దాటింది. అంతేకాదు ఈ తోకచుక్క జూలై రెండో వారంలో భూమిపై నుండి వెళ్ళనుంది.
 
అలా వెళ్లినప్పుడు అది మన కంటికి కనబడుతుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. అది దాదాపు 5 కిలోమీటర్ల పొడవు ఉంటుందని, అది భూమిపై నుండి ప్రయాణంచేటప్పుడు దాని తోకను మనం చూడవచ్చునని తెలిపారు. అయితే ఈ తోకచుక్కను అధికారికంగా సి-2020ఎఫ్3 అని పిలుస్తారు. దీనిని నియోవైజ్ శాటిలైట్ కనిపెట్టింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు