గత 14 రోజులుగా ఇంట్లో నుంచి కాలు బైట పెట్టలేదు, కానీ కరోనా పట్టుకుంది: బాలీవుడ్ నటుడు

గురువారం, 15 ఏప్రియల్ 2021 (18:44 IST)
కరోనావైరస్ సెకండ్ వేవ్ నేపధ్యంలో తనతో పాటు తన కుటుంబం మొత్తం గత 14 రోజులుగా గడప దాటి కాలు బైట పెట్టలేదు కానీ మా కుటుంబాన్ని కరోనా పట్టుకుందని బాలీవుడ్ నటుడు రాహుల్ రాయ్ వెల్లడించారు. తాము వుంటున్న అపార్టుమెంట్లో ఒకరికి కరోనా వచ్చిందని తెలిసిన వెంటనే తాము ఇంటి నుంచి బైటకు రానే రాలేదని తెలిపారు.
 
ముందుజాగ్రత్త చర్యగా అధికారులు మా అపార్టుమెంటుకు సీల్ వేశారు. దాంతో తాము ఎవ్వరం బయటకు రాకుండా 14 రోజులుగా ఇంట్లోనే వున్నాం. కానీ ఓ పని నిమిత్తం మా కుటుంబం అంతా ఢిల్లీ వెళ్లాల్సి రావడంతో టెస్ట్ చేయిస్తే మా కుటుంబానికి అంతటికీ కరోనావైరస్ పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది.
 
ఈ పరీక్ష ఫలితాలను చూసి ఆశ్చర్యపోయాం. అసలు ఇంట్లో నుంచి బైటకు రాకపోయినా కరోనా ఎలా సోకిందో అని అర్థంకాలేదు. కనుక కరోనా పట్ల ఇంకెంత జాగ్రత్తగా వుండాలో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం తామంతా హోం క్వారెంటైన్లో వున్నట్లు రాహుల్ రాయ్ వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు