పోలీసు పట్ల మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య దురుసు ప్రవర్తన: సీఎం చంద్రబాబు వార్నింగ్ (video)

ఐవీఆర్

మంగళవారం, 2 జులై 2024 (20:39 IST)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి తాజాగా పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె పోలీసు ఉద్యోగుల పట్ల అనుచితంగా మాట్లాడారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా షేర్ అవుతుండటమే కాకుండా నెటిజన్లు కూడా తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లింది.
 
దీనితో చంద్రబాబు ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు. అధికారులు, ఉద్యోగుల పట్ల గౌరవంగా మసలుకోవాలనీ, ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. దీనితో మంత్రి రాంప్రసాద్ ఇలాంటివి పునరావృతం కావని సంజాయిషీ ఇచ్చుకున్నారు.

పోలీసులపై మంత్రి భార్య తిట్ల పురాణం

మంత్రి భార్యకి కూడా పోలీసులు ఎస్కార్ట్ గా రావాలని హుకుం.

ఉమ్మడి కడప జిల్లా రాయచోటిలో పోలీసులుపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య దురుసు ప్రవర్తన.

పోలీసులని ఇష్టానుసారంగా దుర్భాషలాడి అవమానించిన మంత్రి భార్య. pic.twitter.com/TR3nWvT08j

— Telugu Scribe (@TeluguScribe) July 1, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు