భారత్ రెండవ మ్యాచ్‌లో మాత్రం ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది. కేదార్ జాదవ్ ఇంకా ఫిట్‌గా లేడని కోహ్లీ తెలిపాడు. ఇంగ్లండ్ చేరుకున్న రెండు రోజుల్లోనే వార్మప్ మ్యాచ్ ఆడాల్సి వచ్చిందని, అందువల్లే సరిగా ఆడలేకపోయామని కోహ్లీ చెప్పాడు. కార్డిఫ్‌లోని సోషియా గార్డెన్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.
ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. అర్ధశతకానికి చేరువలో ఉన్న కెప్టెన్ కోహ్లీ (46 బంతుల్లో ఐదు ఫోర్లతో 47 పరుగులు)ని సైఫుద్దీన్ చక్కటి యార్కర్‌తో బౌల్డ్‌చేశాడు. అంతకు ముందు ధావన్(1), రోహిత్‌శర్మ(19) తక్కువ పరుగులకే ఔటయ్యారు.